విద్యా సంస్థలు బస్సుల ఫిట్‌నెస్‌ను పునరుద్ధరించుకోవాలి
ABN , Publish Date - May 02 , 2026 | 12:15 AM
జిల్లాలో నడుస్తున్న విద్యా సంస్థలు తమ బస్సుల ఫిట్ నెస్‌ను పునరుద్ధరించుకోవాలని, లేనిపక్షంలో తనిఖీల్లో పట్టుబ డితే, సీజ్ చేసి కేసులు పెడతామని రవాణా శాఖ ఉప కమిషనర్ డి.మణికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
అధిక లోడుతో వాహనాలు పట్టుబడితే సీజ్
రవాణా శాఖ ఉపకమిషనర్ మణికుమార్
విజయనగరం దాసన్నపేట, మే 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నడుస్తున్న విద్యా సంస్థలు తమ బస్సుల ఫిట్ నెస్‌ను పునరుద్ధరించుకోవాలని, లేనిపక్షంలో తనిఖీల్లో పట్టుబ డితే, సీజ్ చేసి కేసులు పెడతామని రవాణా శాఖ ఉప కమిషనర్ డి.మణికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి భద్రత దృష్ట్యా ఈనెల 15 లోగా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు తమ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు పూర్తి చేసుకోవాలని ఆయన యాజమాన్యాలను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పునరుద్ధరణ చేసుకోలేని వాహనాలపై నిబంధ నల ప్రకారం కఠిన చర్యలు తీసు కుంటామన్నారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌తో కండిషన్ వాటి ధృవపత్రాలను చెల్లుబాటులో ఉండే విధంగా చూసుకో వలసిన బాధ్యత స్కూల్ బస్సుల యాజమాన్యంపై ఉందన్నారు. వాహన తనిఖీ దారులు విద్యా సంస్థలకు తనిఖీలకు వచ్చినప్పుడు వారితో సహకరించాలని కోరారు. అలాగే ద్విచక్ర వాహనాలపై పరిమితికి మించిన ముగ్గురు ప్రయాణిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. హెల్మెట్ తప్పని సరని, సీటు బెల్టు ధరించాలని, అధిక లోడుతో వాహనం నడపరాదని సూచించారు. నిబంధ నలు అతిక్రమిస్తే మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసు కుంటామన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పా టు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పారు.