పాడి పరిశ్రమతోనే ఆర్థిక పుష్టి
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:59 PM
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలో పేతం కావాలంటే ప్రతి ఇంటిలో పాడి పశువు ఉండాలని, పాలను కేవలం విక్రయానికే కాకుండా పౌష్టికాహారంగా ఉపయోగించు కోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
పార్వతీపురం రూరల్, జనవరి19 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలో పేతం కావాలంటే ప్రతి ఇంటిలో పాడి పశువు ఉండాలని, పాలను కేవలం విక్రయానికే కాకుండా పౌష్టికాహారంగా ఉపయోగించు కోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. హెచ్.కారాడవలసలో సోమవారం నిర్వహిం చిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువుల సంఖ్యను పెంచుకోడం ద్వారా కుటుంబ ఆదాయాన్ని మెరుగుపరచు కోవచ్చునన్నారు. ఒక ఆవును మోపినా, నాలుగు ఆవులను మోపినా సమయం ఒక్కటే నన్నారు. పాలను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం మన ఇంటి ఖర్చులకు సరి పోవాలన్నారు. జిల్లాలో త్వరలోనే మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక డెయిరీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర భారత్‌లోని రాష్ట్రాల తరహాలో మన దగ్గర పన్నీరు వాడకం పెరగాల్సి ఉందన్నారు. అనంతరం స్థానికులు కలెక్టర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ శివ్వాల మన్మథ రావు, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, పశు వైద్యాధికారి ఎం.జయకిరణ్ పాల్గొన్నారు.