Share News

New Industries కొత్త పరిశ్రమలతో ఆర్థికాభివృద్ధి

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:05 AM

Economic Growth Through New Industries కొత్త పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు పెంచి జిల్లా ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు.

New Industries   కొత్త పరిశ్రమలతో ఆర్థికాభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జూలై 29(ఆంధ్రజ్యోతి): కొత్త పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు పెంచి జిల్లా ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల అభివృద్ధి, కొత్త యూనిట్ల ఏర్పాటు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు, ఎగుమతులపై సమీక్షించారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని, పరి శ్రమల ఏర్పాటుకు త్వరితగతంగా అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్‌ సూచించారు. పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌ సీతారాం, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సోమశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

నేడు సీతంపేటలో ‘మన్యం సవారీ’

అడ్వంచర్‌ టూరిజంను ప్రోత్సహించడమే లక్ష్యంగా నేడు సీతంపేటలో మన్యం సవారీ బైక్‌టూర్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 6గంటలకు సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ నుంచి సున్నపుగెడ్డ జలపాతం వరకు బైక్‌ర్యాలీ కొనసాగుతుందన్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తదితరులు హాజరుకానున్నారని వెల్లడించారు.

Updated Date - Jul 30 , 2026 | 12:05 AM