Share News

మాజీ సైనికులకు ఈసీహెచ్‌ఎస్‌ పోలీ క్లినిక్‌

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:47 AM

మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు వైద్యసేవలు పొందేందుకు వీలుగా విజయనగరం సైనిక సంక్షేమ కార్యాల యంలో ఈసీహెచ్‌ఎస్‌ పోలీ క్లినిక్‌ సేవలు ప్రారంభమయ్యాయని మాజీ సైనిక సంక్షేమసంఘం అఽధ్యక్షు డు రేవళ్ల కిరణ్‌కుమార్‌ తెలిపారు.

మాజీ సైనికులకు ఈసీహెచ్‌ఎస్‌ పోలీ క్లినిక్‌
మాట్లాడుతున్న సంఘ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌

బొబ్బిలి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు వైద్యసేవలు పొందేందుకు వీలుగా విజయనగరం సైనిక సంక్షేమ కార్యాల యంలో ఈసీహెచ్‌ఎస్‌ పోలీ క్లినిక్‌ సేవలు ప్రారంభమయ్యాయని మాజీ సైనిక సంక్షేమసంఘం అఽధ్యక్షు డు రేవళ్ల కిరణ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక పాతకోటలో సంఘం కార్యాల యంలో సోమవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లా డారు. వైద్యసేవల కోసం మాజీ సైనిక కుటుంబాల వారు విశాఖపట్టణం వెళ్లాల్సిన అవసరం లేకుండానే విజయనగరంలోనే క్లినిక్‌కు ఏర్పాటు చేశార న్నారు. ఎంప్యానల్‌మెంట్‌ ఆసుపత్రులకు రిఫరల్‌ సదుపాయం ఉందన్నారు. సమావేశంలో సంఘం నాయకులు మరడ రామినాయుడు, రామకృష్ణ, గోవిందనాయుడు, రవి మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:47 AM