ఈస్ట్‌కోస్ట్ టు సౌత్‌కోస్ట్
ABN , Publish Date - May 06 , 2026 | 12:19 AM
రాష్ట్ర విభజనకు ముం దు, తర్వాత విశాఖ జోన్ ఏర్పా టు చేయాలని ఉత్తరాంధ్రతో ఉమ్మడి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపో వడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకపోవడం వల్ల విశాఖజోన్ ఏర్పాటు కాలేదు.
భువనేశ్వర్ నుంచి విశాఖ జోన్‌కు బదిలీ
గెజిట్ జారీ చేసిన రైల్వేశాఖ
కూటమి ప్రభుత్వం చొరవతో నెరవేరిన కల
రైల్వేశాఖ పరంగా ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరింది. దశాబ్దాలుగా విశాఖ రైల్వేజోన్(సౌత్ కోస్ట్) ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం సానుకూలంగా స్పందించడంతో.. విశాఖ జోన్ ఏర్పాటుకు రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ ఒకటో తేదీ నుంచి సౌత్‌కోస్ట్ రైల్వే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇకపై ఈస్ట్‌కోస్ట్ పరిధిలో పలు స్టేషన్లు.. సౌత్‌కోస్ట్ పరిధిలోకి రానున్నాయని, తద్వారా అభివృద్ధి చెందనున్నాయని జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పార్వతీపురం, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజనకు ముం దు, తర్వాత విశాఖ జోన్ ఏర్పా టు చేయాలని ఉత్తరాంధ్రతో ఉమ్మడి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపో వడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకపోవడం వల్ల విశాఖజోన్ ఏర్పాటు కాలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కూడా విశాఖ జోన్ గురించి అస్సలు పట్టించుకోలేదు. సీఎం చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఈ జోన్‌పై కదలిక మొదలైంది. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. దీంతో విశాఖజోన్ ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కలను కూ టమి ప్రభుత్వం నేరవేర్చిం దన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.
ఎన్నో ప్రయోజనాలు
గతంలో జిల్లాలోని కోనేరు రైల్వేస్టేషన్ నుంచి విశాఖప ట్నం వరకు, అలాగే సా లూరు నుంచి విశాఖ పట్నం వరకు ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ పరిధిలో ఉం డేవి. తాజాగా విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు కావడంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలో ఉన్న కోనేరు, పార్వతీపు రం, సాలూరు రైల్వే స్టేషన్లు సౌత్‌కోస్ట్ రైల్వే పరిధిలో ఉంటాయి. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుతో పార్వతీపురం, కోనేరు, సాలూరు తదితర రైల్వేస్టేషన్లలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ప్రజా ప్రతినిధులు విశాఖలోని రైల్వేజోన్ అధికారుల వద్దకు వెళ్లి సమ్యలు ప్రస్తావించే వెసులుబాటు ఉంటుంది. జోన్ మార్చడంతో సా లూరు రైల్వేస్టేషన్ అభి వృద్ధిపై ఆశలు చిగురిస్తు న్నాయి. గతంలో బొబ్బిలి నుంచి సాలూరు, సాలూరు నుంచి బొబ్బిలికి రైలు బస్సు న డిచేది. దాన్ని కూడా రద్దు చేశారు. కొంతకాలం క్రితం విశాఖ నుంచి సాలూ రు, సాలూరు నుంచి విశాఖకు రైలు ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు ప్రకటించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రైల్వేలో ఉద్యోగాలు లభించా లంటే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఉత్తరాంధ్రతో పాటు జిల్లాకు చెందిన నిరుద్యోగులు గతంలో పోటీ పరీక్షలకు హాజరుకావాలంటే ఒడిశాలోని భువనేశ్వర్ లేదా తెలంగాణలోని సికింద్రాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒడిశాలో ఈ పరీక్షలకు హాజరయ్యే తెలుగు వారిని అక్కడివారు అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విశాఖ జోన్ రావడం వల్ల ఆ పరిస్థితి ఉండదు. రైల్వేలో ఉద్యోగాల నియామకాల కోసం పోటీ పరీక్షలు విశాఖలోనే నిర్వహిస్తారు.
కొత్త ట్రైన్లు ఏర్పాటు సమస్యలు పరిష్కారం...
కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలంటే సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్‌కు వెళ్లి అధికారులకు వినతిప త్రాలు అందించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య ఉండదు. ఏ చిన్న సమస్య వచ్చినా, కొత్త ప్రతిపాదనలు సమర్పించాలన్నా విశాఖకే వెళ్లవచ్చు.
జోన్లు రూపాంతరం ఇలా..
బీఎన్‌ఆర్ (బెంగాల్-నాగపూర్ రైల్వే)లో రైల్వేశాఖ ఏర్పడిన తొలినాళ్లలో పలాస వరకూ ఉండేది. ఖుర్ధారోడ్ డివిజన్ పరిధిలోనే ఈ ప్రాంతాలు రూపాంతరం చెందాయి. అనంతరం రైల్వేశాఖ జోన్లు విభజనలో భాగంగా సౌత్‌ఈస్ట్రన్ రైల్వే (గార్డెన్‌రీచ్, కోల్‌కతా)లోకి మారింది. జనావాసాలు పెరగడం, రైల్వే ప్రయాణికుల సంఖ్య అధికం కావడంతో మరోసారి జోన్లను పునర్విభజించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా ఏర్పడి అందులోనే ప్రస్తుతం వరకూ ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం చొరవతో విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్టు రైల్వేడివిజన్ ఏర్పాటైంది. కోనేరు, పార్వతీపురం, సాలూరు రైల్వేస్టేషన్లు ఇప్పుడు సౌత్‌కోస్ట్ రైల్వే పరిధిలోకి వస్తాయి.