Share News

Earphones that claimed lives ప్రాణాలు తీసిన ఇయిర్‌ఫోన్స్‌

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:36 PM

Earphones that claimed lives దీపావళి పండుగ కోసం ఇంటికొచ్చిన యువకుడు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. కుమారుడు ప్రయోజకుడై ఉద్యోగం చేస్తున్నందుకు తల్లిదండ్రులు కూడా ఎంతో మురిసిపోయారు. పాపం ఆ ఆనందం వారిలో ఎంతోకాలం నిలువలేదు. రైలు రూపంలో విధి ఇంటి దీపాన్ని తీసుకుపోయింది. పురిటిపెంటగ్రామ పంచాయతీ మామిడిబంద కాలనీకి చెందిన శీరం రెడ్డి పవన్‌కల్యాణ్‌(23) విషాదాంతమిది.

Earphones that claimed lives ప్రాణాలు తీసిన ఇయిర్‌ఫోన్స్‌
పవన్‌కల్యాణ్‌ (ఫైల్‌)

ప్రాణాలు తీసిన ఇయిర్‌ఫోన్స్‌

పట్టాలు దాటుతుండగా యువకుడ్ని ఢీకొన్న రైలు

పండుగకు వచ్చి విషాదం

గజపతినగరం, నవంబరు10(ఆంధ్రజ్యోతి):

- దీపావళి పండుగ కోసం ఇంటికొచ్చిన యువకుడు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. కుమారుడు ప్రయోజకుడై ఉద్యోగం చేస్తున్నందుకు తల్లిదండ్రులు కూడా ఎంతో మురిసిపోయారు. పాపం ఆ ఆనందం వారిలో ఎంతోకాలం నిలువలేదు. రైలు రూపంలో విధి ఇంటి దీపాన్ని తీసుకుపోయింది. పురిటిపెంటగ్రామ పంచాయతీ మామిడిబంద కాలనీకి చెందిన శీరం రెడ్డి పవన్‌కల్యాణ్‌(23) విషాదాంతమిది.

- తెలిసిన ప్రాంతం కావడం.. రోజూ వెళ్లే రోడ్డే కదా అనుకున్న ఆ యువకుడు ఫోన్‌ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అంతలో రైల్వే ట్రాక్‌ వచ్చింది. అది కూడా దాటేస్తున్నానని అనుకున్నాడు. కానీ విషయం గ్రహించే లోపే రైలు వచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించినా ప్రాణం దక్కలేదు.

సెల్‌ఫోన్‌ ఆన్‌చేసి ఇయిర్‌ఫోన్స్‌లో మాట్లాడుకుంటూ పట్టాలు దాటుతున్న యువకుడు రైలు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బొబ్బిలి రైల్వేహెడ్‌ కానిస్టేబుల్‌ ఈశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పురిటిపెంటగ్రామ పంచాయతీ మామిడిబంద కాలనీకి చెందిన శీరంరెడ్డి పవన్‌కల్యాణ్‌ (23) మంగళవారం తెల్లవారుజామున ఇంటినుంచి బహిర్భూమికని బయలుదేరాడు. చెవిలో ఇయిర్‌ఫోన్స్‌ పెట్టుకొని నడుస్తూ రైలు పట్టాలు దాటుతున్నాడు. రైలు వస్తున్నట్లు గమనించే లోపు రైలు ఢీకొంది. బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళుతున్న కోర్బా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవన్‌కల్యాణ్‌ను 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కల్యాణ్‌ ఇటీవలే చెన్నైలో ఇంజనీరింగ్‌ చదువు పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాడు. ట్రైనింగ్‌లో ఉన్నాడు. దీపావళికి పండుగ కోసం ఇంటికి వచ్చిన పవన్‌ మంగళవారం రాత్రికి హైదరాబాద్‌ వెళ్లేందుకు రిజర్వేషన్‌ కూడా చేయించుకున్నాడు. అంతలోనే కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు సత్యం, రామకృష్ణ రోదనను చూసిన వారంతా కన్నీరు పెట్టారు. తండ్రి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 10 , 2026 | 11:36 PM