Share News

Cancer ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్‌కు చెక్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:32 PM

Early Detection Can Stop Cancer ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు.

 Cancer  ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్‌కు చెక్‌
అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

పార్వతీపురం, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ జీవనశైలితో పాటు ఆహార నియమావళిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎన్‌సీడీ 4.0 సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేస్తున్నారన్నారు. పల్లెవాసుల్లో నోటి, రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ లక్షణాలను గర్తించి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం క్విజ్‌ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఆయన వెంట ఎన్‌సీడీ పీవో జగన్మోహన్‌రావు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:32 PM