నేటి నుంచి ఈఏపీ సెట్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:23 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు (ఈఏపీసెట్) సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 20 నుంచి 29 వ తేదీలోగా ఆన్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 31 వరకు దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగనుంది. 25 నుంచి 31వ తేదీ వరకు ఆప్షన్లను ఎంపిక చేసుకుని నమోదు చేయాలి.
నేటి నుంచి ఈఏపీ సెట్ కౌన్సెలింగ్
31 వరకూ వెట్ ఆప్షన్ల నమోదు
కళాశాల ఎంపికలో అప్రత్తంగా ఉండాలి
ప్రత్యేక కేటగిరి అభ్యర్ధులకు విజయవాడలో కౌన్సెలింగ్
విజయనగరం కలెక్టరేట్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు (ఈఏపీసెట్) సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 20 నుంచి 29 వ తేదీలోగా ఆన్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 31 వరకు దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగనుంది. 25 నుంచి 31వ తేదీ వరకు ఆప్షన్లను ఎంపిక చేసుకుని నమోదు చేయాలి. ఆగస్టు 6న విద్యార్థులకు కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. 7నుంచి 13 వరకు విద్యార్థులు తమకు సీటు వచ్చిన కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. కాగా ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మాన్యువల్ కౌన్సెలింగ్ జరుగుతుంది. పీడబ్ల్యూడీ, సీఏపీ, ఎన్‌సీసీ, స్కౌట్ అంట్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు తమ ఒరిజనల్ విద్యార్హతలు, ఇతర అర్హతల సర్టిఫికెట్లతో ప్రత్యేక పరిశీలనకు హాజరుకావాలి. ఏ రోజు ఏ ర్యాంకు వరకు రావాలనేది తెలుసుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని కన్వీనర్ ప్రకటించారు.
ఈ జాగ్రత్తలు అవసరం
వెబ్ ఆప్షన్ల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలి. నచ్చిన కోర్సులు, కళాశాలలను ముందుగానే ప్రాధాన్యతా క్రమంలో జాబితాను సిద్ధం చేసుకోవాలి. దాని ఆధారంగా ఆప్షన్లు నమోదు చేయాలి. విద్యార్థుల సౌకర్యార్థం విజయనగరం ప్రభుత్వపాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనుమానాల నివృత్తికి జిల్లా హెల్పెలైన్ సెంటర్‌లో నేరుగా సంప్రదించవచ్చు.
కళాశాల ఎంపిక, కోడ్ అంశాల్లో జాగ్రత్త
పలు ఇంజనీరింగ్ కళాశాలల షార్ట్‌ఫాంలు వేరే ఇతర కళాశాలల పేర్లవలే ఉన్నాయి. కోరుకున్న కళాశాలలకు కాకుండా మరో కళాశాలకు ఆప్షన్ నమోదయ్యే ప్రమాదముంది.. ఇలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోడ్‌ల ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది.
అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు
ఈఏపీసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, టెన్త్, ఇంటర్ మార్కుల లిస్టు, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రిజర్వేషన్ ఆధారిత సర్టిఫికెట్, ఏడు సంవత్సరాల రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉండాలి. జిల్లాలో 7 ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు ఐదు వేలకు పైగా సీట్లు ఉన్నాయి. ఏపీఈఏపీ సెట్‌ను జిల్లాలో 24028 మంది విద్యార్థులు రాశారు.