Share News

అంధుల క్రికెట్‌ జట్టుకు దుర్గారావు ఎంపిక

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:23 AM

బంగ్లాదేశ్‌లో నవం బరు 15 నుంచి 20 వరకు నిర్వహించ నున్న ఆసియా కప్‌ అంధుల క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు కొప్పరవలసకు చెందిన టొంపల దుర్గారావు ఎంపికయ్యారు.

అంధుల క్రికెట్‌ జట్టుకు దుర్గారావు ఎంపిక

వంగర, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌లో నవం బరు 15 నుంచి 20 వరకు నిర్వహించ నున్న ఆసియా కప్‌ అంధుల క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు కొప్పరవలసకు చెందిన టొంపల దుర్గారావు ఎంపికయ్యారు. గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పలుమార్లు పాల్గొని ప్రతిభ చాటాడు. ప్రధాని మోదీ కూడా అభినందించా రు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావటంపై ఈయన తల్లితో పాటు గ్రామస్థులు సోమవారం హర్షం వ్యక్తం చేశా రు. అంతర్జాతీయ వేదికపై విజయాన్ని సాధిం చాలని మండల ప్రజలు ఆకాంక్షించారు.

Updated Date - Oct 27 , 2026 | 12:23 AM