నిర్వహణ లేక.. నీరు ప్రవహించక
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:26 AM
మండలంలోని సాకిగెడ్డ, వర హాలగెడ్డ నిర్వహణకు నోచుకోకపోవడంతో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఈ రెండుగెడ్డలు ఆక్రమణల పుణ్యమాని కుచించుకుపోవడంతో నీరు ఉధృతంగా ప్రవ హించని పరిస్థితి నెలకొంది. దీంతో పంట పొలాలు ఏటా ముంపునకు గురవుతు న్నాయి.
పార్వతీపురం రూరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సాకిగెడ్డ, వర హాలగెడ్డ నిర్వహణకు నోచుకోకపోవడంతో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఈ రెండుగెడ్డలు ఆక్రమణల పుణ్యమాని కుచించుకుపోవడంతో నీరు ఉధృతంగా ప్రవ హించని పరిస్థితి నెలకొంది. దీంతో పంట పొలాలు ఏటా ముంపునకు గురవుతు న్నాయి. గెడ్డలో నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో తుప్పులు, డొంకలు పెరిగి పోయాయి. దీంతో ఖరీఫ్‌లో సైతం ఆయకట్టుకు నీరందడంలేదని రైతులు వాపో తున్నారు. అటు ఆక్రమణలపై గాని, గెడ్డ నిర్వహణపై గాని జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షించడంలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
లచ్చిరాజుపేట సమీపంలో ఉన్న సాకిగడ్డ ఆక్రమణలకు గురవుతున్నా అధికారు లు చోద్యంచూస్తున్నారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గెడ్డ ఆక్రమణల పుణ్యమాని ఏటావర్షాకాలంలో నీటిప్రవాహం ఉధృతిపెరగడంతో రాక పోకలకు ఇబ్బందులు తప్పడంలేదు.దీనికితోడు పంటలు ముంపునకు గురై నష్టపో తున్నామని రైతులు వాపోతున్నారు. ఇక్కడ ఏటా అఽధికవర్షాలు కురవడంతోపాటు చుట్టుపక్కల వాగుల నుంచి నీరు సాకిగెడ్డలోకి చేరుతోంది. దీంతో ఆగస్టు నుంచి నవంబరు వరకు గెడ్డలో ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. వరహాలగెడ్డ పరిస్థితి కూడా ఇదే దుస్థితిలోఉంది. కాలువలను నిర్వహణ లేకపో వడంతో పాటు వరహా లగడ్డ నీరు ప్రవహించే ప్రాంతాల్లో కూడా కనీస మరమ్మతులు చేపట్టలేదు. దీంతో లక్ష్మీనారాయణపురం తదితర ప్రాంతాల్లో నీరు ప్రవహించేందుకు వీలులేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.ఏళ్లతరబడి గెడ్డలో పిచ్చిమొక్కలు తొలగించ పోవడంతోవర్షాకాలంలో సమీప వ్యవసాయ భూములకు నీరందడంలేదని చెబుతు న్నారు. ఇప్పటికైనా జలవనరులశాఖ అధికారులు స్పందించి వీటి నిర్వహణపై దృష్టిసారించాలని