నిర్వహణ లేక.. ఆదాయానికి నోచుకోక
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:23 AM
శృంగవరపుకోట పంచాయతీలో పాత బస్టాండ్, ప్రకాశం మార్కెట్లను వినియోగంలోకి తీసుకొచ్చే విషయంపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి.
శృంగవరపుకోట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట పంచాయతీలో పాత బస్టాండ్, ప్రకాశం మార్కెట్లను వినియోగంలోకి తీసుకొచ్చే విషయంపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా నిర్వహణ లోపం వల్ల ఏటా పంచాయతీ రూ.లక్షల్లో ఆదాయాన్ని కోల్పోతోంది. పంచాయతీకి ఆదాయం సృష్టించేందు కు అవకాశంఉన్నా అధికారులు శ్రద్ధచూపడం లేదని పలువురు చెబుతున్నారు.శృంగవరపుకోటలోని దేవీబొమ్మ కూడలి నుంచి విజయ నగరం రోడ్డుకు ఆనుకుని పాత బస్టాండ్ స్థలంలో కూరగాయలు, మాంసం, చేపలమార్కెట్‌గా ఉండేది. వివిద గ్రామా లకు చెందిన రైతులు తమ పొలాల్లో పండించిన కూరగాయలను ఇక్కడకు తేచ్చి వ్యాపారులకు విక్ర యించేవారు.రోజంతా ఇక్కడ కూరగాయలను అమ్మే వారినుంచి వినియోగదారులు కోనుగోలుచేసేవారు. పదేళ్ల కిందట స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆనుకుని రైతుబజారు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆకు కూరలు,కూరగాయల వ్యాపారాన్ని రైతుబజారుకు తరలించారు.ఈనేపథ్యంలో ఆ స్థలం ఖాళీఅయ్యింది. దీంట్లో అప్పట్లో వివిద రకాల వ్యాపారాలు చేసేందు కు పీపీ పద్ధతిలో చిన్న చిన్న షెడ్లు పనులు ప్రారం భించారు.అయితే ఈపనులు అర్ధాంతరంగా నిలిచి పోవడంతో వీటిల్లో వ్యాపారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నా యి. ఈ షెడ్లను ఎందుకు, ఎవరు నిర్మించారో నన్న వివరాలు పంచాయతీ వద్ద లేవు. వాటి స్థానంలో మెరుగైన వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలన్న ఆలోచన చేసే వారే కరువయ్యారు.
శుక్రవారం సంతగా...
పంచాయతీకార్యాలయానికి కూత వేటు దూరం లో ప్రకాశం మార్కెట్ స్థలం ఉంది. ఇది ఒకప్పుడు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెం దిన వారికి కూరగాయలు విక్రయాలకు ప్రధాన కూడలిగాఉండేది. పాత బస్టాండ్ మార్కెట్ అభివృ ద్ధిచెందిన తర్వాతకాలక్రమంలో శుక్రవారం సంతగా మారింది. ఇక్కడచుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారితోపాటు గిరిజన గ్రామాల నుంచి వచ్చి వారా నికి సరిపడ సరుకులు కోనుగోలుకు ఉదయానికే ఇక్కడకు వచ్చేసేవారు. అటువంటి స్థలం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. ఒక వైపు విజయనగరం నుం చి వచ్చేటప్పుడు ఒన్‌వేట్రాపిక్ రోడ్డు, మరోవైపు వి జయనగరంవేళ్లేందుకు గాంధీబొమ్మసెంటర్ రోడ్డుకు అందుబాటులో ఉంది. వ్యాపార, వాణిజ్యానికి అనుకూలమైన స్థలం కావడంతో వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పంచాయతీ ఆదాయాన్ని కోల్పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.