ఆరోగ్యం బాగోలేక..
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:15 AM
బతుకు తెరువు కోసం వలస వెళ్లి.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆ ఇంటి పెద్దకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
మనస్తాపంతో భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య
దిక్కుతోచని స్థితిలో కుటుంబం
బతుకు తెరువు కోసం వలస వెళ్లి.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆ ఇంటి పెద్దకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తీవ్ర మన స్తాపానికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడింది. వివరాలిలా ఉన్నాయి.
మెంటాడ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మెంటాడ మండ లంలోని కైలాం గ్రామానికి చెందిన గండి కామునాయుడు (40) బతుకు తెరువు కోసం తన కుటుంబంతో సహా చాలా ఏళ్ల కిందట విశాఖకు వలస వెళ్లాడు. విశాఖలోని పీఎం పాలెంలో నివాసం ఉంటూ.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకున్నాడు. అందిన సమాచారం మేరకు పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలాని కి చేరుకుని, మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య వెంకటి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఇంజినీరింగ్, కుమారుడు డిగ్రీ చదువుతున్నారు.