Share News

పార్టీకోసం కష్టబడిన వారికి సముచితస్థానం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:12 AM

పార్టీ కోసం కష్టబడిన వారికి సముచిత స్థానం ఉంటుందని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.

పార్టీకోసం కష్టబడిన వారికి సముచితస్థానం
కండువావేసి టీడీపీలోకి ఆహ్వానిస్తున్న బంగార్రాజు

  • నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు

  • తూడెం పంచాయతీలో 80 కుటుంబాలు టీడీపీలో చేరిక

భోగాపురం, అక్టోబరు12(ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టబడిన వారికి సముచిత స్థానం ఉంటుందని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. సోమవారం మండలంలోని తూడెం పంచాయతీలో వైసీపీ నుంచి మాజీ సర్పంచ్‌లు కుంచం నాగమ్మ, రీసు నర్శయ్యమ్మ, కవులవాడ మాజీ ఎంపీటీసీ కుంచం సూరప్పారావు, వార్డు మెంబర్లు నీలాపుసూర్యనారాయణ, దువ్వురాంబాబు, ఉప్పిలిరాముతో కలిసి 80 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరందరిని బంగార్రాజు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్ర మంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ దంతులూరి సూర్యనారాయణరాజు, నీలాపు అప్పలరామిరెడ్డి, కోరాడ తాతారావు, రీసురమణ పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 12:12 AM