Share News

DSP డీఎస్పీ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:05 PM

DSP Assumes Charge పార్వతీపురం డీఎస్పీగా సీహెచ్‌వీ శేషయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు.

DSP   డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
ఎస్పీని కలిసిన డీఎస్పీ

బెలగాం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం డీఎస్పీగా సీహెచ్‌వీ శేషయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్‌ నేరాల నివారణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ ఆయనకు సూచించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

Updated Date - Oct 05 , 2026 | 11:05 PM