డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:52 PM
వాహనాలను నడిపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ ఏఆర్ దామెదర్ అన్నారు.
- ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): వాహనాలను నడిపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ ఏఆర్ దామెదర్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయనగరంలోని ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌లో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఇందులో డ్రైవర్ల పాత్రక్రియశీలకమన్నారు. వాహనాలు నడిపే సమయంలో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు తప్పవన్నారు. పాదచారులను, ఇతర వాహనాల డ్రైవర్లను, వారి కుటుంబ సభ్యులను ఆర్టీసీలో ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయనే విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాంలో రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్, డీఎస్పీ గోవిందరావు, ఆర్టీసీ డీపీటీవో వరలక్ష్మి, సీఐలు లీలారావు, సూరినాయుడు, ఆర్‌వీఆర్కే చౌదరి, ఆర్టీసీ డ్రైవర్లు , సిబ్బంది పాల్గొన్నారు.