డ్రైవర్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:06 AM
డ్రైవర్లు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ ఉపకమిషనర్ మణికుమార్ అన్నారు.
విజయనగరం క్రైం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): డ్రైవర్లు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ ఉపకమిషనర్ మణికుమార్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం విజయనగరం లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రవాణా శాఖ కార్యాలయం నుంచి జాతీ య రహదారి వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం డ్రైవర్లకు ఆరోగ్య, నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖాధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. అలాగే డ్రైవర్లకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, వారు విధులు నిర్వహిం చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటా రు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు దుర్గాప్రసాద్, శశికుమార్, శివరామగోపాల్, ఉషా, శ్రా వ్య, రమేష్‌కుమార్, నవీన్‌కుమార్, ఐశ్వర్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.