Share News

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - May 01 , 2026 | 12:39 AM

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతిచెందిన ఘటన మండలంలోని అలమండ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

    ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

జామి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతిచెందిన ఘటన మండలంలోని అలమండ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతపల్లి అప్పారావు(60) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం తన ట్రాక్టర్‌లో ఎరువులు వేసేందుకు గ్రామ సమీపంలోని నారాయణపురం వద్దకు ట్రాక్టర్‌తో వెళ్తున్నాడు. ఈక్రమంలో అకస్మాత్తుగా ట్రాక్టర్‌ అదుపుతప్పింది. వెంటనే అప్పారావు పక్కనే ఉన్న పొలంలో పడిపోయాడు. ఎటువంటి దెబ్బలు తగలలేదు అనుకుం టున్న సమయంలో అనుకోకుండా ట్రాక్టర్‌ తొట్టె అతనిపై పడిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య మంగమ్మ, పిల్లలు చింత పల్లి, భవానీ, నానిలతో పాటు తల్లి ఉంది. ఈ కేసును ఏఎస్‌ఐ వేంకటేశ్వరరావు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 01 , 2026 | 12:39 AM