రూ.67కోట్లతో తాగునీరు
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:26 AM
నగ ర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగేలా రూ.67కో ట్లతో తాగునీటి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నా మని నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలి పారు.
విజయనగరం టౌన్, మార్చి 28(ఆంధ్రజ్యోతి): నగ ర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగేలా రూ.67కో ట్లతో తాగునీటి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నా మని నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలి పారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాల యంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమావేశ మయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత 2.0లో భాగంగా ఇప్పటికే రూ.67కోట్లు నిధులు విడుదలయ్యాయన్నారు. ఈ నిధులతో నగరంలోని వైఎస్సార్ నగర్‌లో వెయ్యి కేఎల్ సామర్థ్యంగల వాటర్ ట్యాంకు, పంప్‌హౌస్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా మని చెప్పారు. అలాగే వాటర్‌ట్యాంకు నిర్మాణానికిగా ను పది సెంట్ల స్థలాన్ని గుర్తించాలని ఇంజనీరింగ్ సాంకేతిక శాఖ అధికారి జ్యోతికి ఆదేశించారు. అలాగే నగరంలోని పదివేల కుళాయి కనెక్షన్లు అదనంగా మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మధుపాడ పంప్ హౌస్ వద్ద నూతన బావుల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు శ్రీనివాస్, రత్నాకర్, నరసింహారెడ్డి, ఏసీపీ హరిబాబు, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం..
నగరంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధా న్యత ఇస్తున్నామని నగర కమిషనర్ బాలస్వామి తెలి పారు. నగరంలోని కాటవీధి బాలుర వసతిగృహంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిం చారు. ముందుగా వసతిగృహంలోని అన్ని గదులను పరిశీలించారు. అనంతరం ఆవరణలో ఉన్న ఎరువు తయారీ గుంతను పరిశీలించి, దాని ఉపయోగాన్ని బాలురను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహం వార్డెన్ సింహాచలానికి తడి, పొడి చెత్తబుట్ట లను అందజేశారు. మెప్మా పీడీ చిట్టిరాజుతో కలిసి వసతిగృహ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.