Share News

డ్రైనేజీలో తాగునీటి కుళాయిలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:17 AM

మండలం లోని పాతశ్రీరంగరాజపురం గ్రామంలో తాగునీటి కుళా యిలను డ్రైనేజీలో ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీలో తాగునీటి కుళాయిలు

  • పాతశ్రీరంగరాజపురంలో అధికారుల నిర్వాకం

  • ఆందోళన వ్యక్తంచేస్తున్న గ్రామస్థులు

గజపతినగరం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మండలం లోని పాతశ్రీరంగరాజపురం గ్రామంలో తాగునీటి కుళా యిలను డ్రైనేజీలో ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలో పైపులైన్లు వేసి తాగునీరు సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడంతో గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుళాయిలు పాడైన సందర్భంలో తాగునీ రు కలుషితం అయ్యే అవకాశం ఉంటుందని, దీంతో రోగాల బారిన పడాల్సి వస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజీలో మురుగునీరు నిండి ఉంటుంది.. ఆ సమ యంలో తాగునీరు పట్టుకోవడం కూడా కష్టతరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ పాలకులు, అధికారులు డ్రైనేజీలో కాకుం డా రోడ్డుకు ఇరువైపులా కుళాయిలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

త్వరలో మార్పు చేస్తాం

గత ఏడాదిలో పైపులైన్‌ పనులు చేపట్టాం. ఆ తర్వాత పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సంబం ధిత శాఖ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టింది. అయితే వారు కొన్నిచోట్ల కుళాయిలు ఉన్న ప్రాంతంలో కాలువల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే వీటిని మార్పు చేస్తాం.

- శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ, గజపతినగరం

Updated Date - Apr 01 , 2026 | 12:17 AM