Share News

Drinking water should not be a problem తాగునీటి సమస్య తలెత్తకూడదు

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:52 PM

Drinking water should not be a problem జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. తాగునీటి వనరుల వద్ద కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరింత ముఖ్యమని చెప్పారు. శనివారం గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి పనులపై టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

Drinking water should not be a problem తాగునీటి సమస్య తలెత్తకూడదు
: మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

తాగునీటి సమస్య తలెత్తకూడదు

ఉపాధి హామీ పనులను అన్ని గ్రామాల్లో ప్రారంభించాలి

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. తాగునీటి వనరుల వద్ద కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరింత ముఖ్యమని చెప్పారు. శనివారం గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి పనులపై టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తాగునీటి సమస్యపై వస్తున్న వార్తలపై వెంటనే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలని ఆదేశించారు. పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని, ప్రతి గ్రామంలో మండల స్థాయి అధికారులు వేసవి ప్రణాళికపై దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామీ పనులు ముమ్మరంగా జరగడానికి వేసవి కాలం అనుకూలమని, అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభం కావాలని సూచించారు. సమీక్షలో జడ్పీ సీఈవో సత్యనారాయణ, డీపీవో మల్లికార్జునరావు, గ్రామీణ మంచి సరఫరా ఎస్‌ఈ కవిత ఉన్నారు.

రెవెన్యూ వసూలులో లక్ష్యాలు చేరుకోవాలి

రెవెన్యూ వసూలులో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో శనివారం సమీక్షిస్తూ వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి జిల్లాలో పరిశ్రమలు, సంస్థల కార్యాలయాల రిజిస్ర్టేషన్‌ జిల్లాలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికార లేఅవుట్‌లకు నోటీసులు జారీ చేయాలన్నారు. కొత్తవలస, తెర్లాం రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌లు తగ్గడంపై నివేదిక ఇవ్వాలన్నారు.

జూన్‌ నాటికి భూములు సిద్దం చేయాలి

జిల్లాలో ఉద్యాన సాగును విస్తరించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ హార్టీ విజన్‌ కార్యక్రమంలో భాగంగా రెండవ విడత లక్ష్యం మేరకు 7260 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు జూన్‌ నాటికి భూములు సిద్ధం చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన శనివారం సమీక్షిస్తూ ఈ మేరకు నిర్దేశించారు. జిల్లాలో కూరగాయలు, ఆకు కూరలు, కొబ్బరి , ఆయిల్‌పామ్‌ , డ్రాగన్‌ ప్రూట్‌ తదితర ఉద్యాన, అంతర్‌ పంటలను సాగు చేయడం ప్రధాన లక్ష్యమన్నారు. ఖరీఫ్‌ (2026-27)లో 7260 ఎకరాలలో ఉద్యాన సాగు లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుతం 2714 మంది రైతులకు చెందిన 6,037 ఎకరాలు భూమిని గుర్తించామన్నారు.

6 నుంచి జలదార

రాష్ట్రంలో భూగర్భ, ఉపరితల జల మట్టాలను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నీటి భద్రత -సాగునీటి సంఘాల భాధ్యత అనే పేరుతో 100 రోజులు ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతోందని శనివారం తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం ఈనెల 6 నుంచి జూలై 14 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అమలు కానుందని పేర్కొన్నారు.

============

Updated Date - Apr 04 , 2026 | 11:52 PM