ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం
ABN , Publish Date - Mar 17 , 2026 | 10:56 PM
ఎన్ని కల కమిషన్ ఆదేశాల ప్రకారం పంచాయతీ కార్యాలయాలు లేదా గ్రామసచివాలయాల వద్ద ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శనకు సన్నా హలు జరుగుతున్నాయి.
- డీపీవో కార్యాలయానికి అందించిన కార్యదర్శులు
- నేడు ప్రదర్శించే అవకాశం
పార్వతీపురం, మార్చి17(ఆంధ్రజ్యోతి): ఎన్ని కల కమిషన్ ఆదేశాల ప్రకారం పంచాయతీ కార్యాలయాలు లేదా గ్రామసచివాలయాల వద్ద ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శనకు సన్నా హలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే గ్రామ కార్యదర్శులు తయారు చేసిన ఓటరు జాబితాను జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాల యానికి (డీపీవో) మంగళవారం అం దించారు. వాస్తవంగా ఈనెల 9న ఈ జాబితాను ప్రదర్శిం చాల్సి ఉన్నప్పటికీ 18కి వాయిదా పడింది. అయితే దీనిపై ఇంకా ఆదేశాలు రాలేనప్పటికీ కార్యదర్శులు మాత్రం ముసాయిదా ఓటర్ల జా బితాను డీపీవో కార్యాలయానికి అందజేశారు. బుధవారం గ్రామ సచివాలయాల వద్ద లేదా పంచాయతీ కార్యాలయాల వద్ద ఆ జాబితాను ప్రదర్శించే అవకాశం ఉంది. దీనిపై డీపీవో కొండలరావును వివరణ కోరగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నామన్నారు.