Share News

Kidney Disease కిడ్నీ వ్యాధిపై ఆందోళన వద్దు

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:03 AM

Don’t Worry About Kidney Disease కిడ్నీ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి తెలిపారు. శక్రవారం చిలకాంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను ఆమె పరామర్శించారు. కేజీహెచ్‌ ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజీ వైద్యుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో బాధితులకు వైద్య పరీక్షలు చేశారు.

 Kidney Disease కిడ్నీ వ్యాధిపై ఆందోళన వద్దు
చిలకాంలో కిడ్నీ సమస్యలపై వివరాలు సేకరిస్తున్న వైద్యాధికారులు

  • చిలకాంలో వైద్య పరీక్షలు

గరుగుబిల్లి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): కిడ్నీ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి తెలిపారు. శక్రవారం చిలకాంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను ఆమె పరామర్శించారు. కేజీహెచ్‌ ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజీ వైద్యుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో బాధితులకు వైద్య పరీక్షలు చేశారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలేంటి.. ఆహారపు అలవాట్లు, తదితర సమాచారాన్ని బాధితుల నుంచి సేకరించారు. గ్రామస్థులు వాడే తాగునీటి శాంపిల్స్‌ సేకరించారు. గ్రామంలోని పలువురి నుంచి రక్త నమూనాలు సేకరించారు. పలు గ్రామాల్లో ఈ సమస్య నెలకొందన్నారు. ఈ మేరకు వ్యాధుల నిర్ధారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే చిలకాలంలో పలు దఫాలు వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. వ్యాధి నిర్ధారణ తర్వాత ప్రభుత్వపరంగా అవసరమైన వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందిస్తామని వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు, కేజీహెచ్‌ వైద్యులు వి.వందన, టి.శిరీష, తపస్వీ, వీవీ శ్రావాణి, టి.మారుతీరావు, రావివలస పీహెచ్‌సీ వైద్యులు కీర్తి, శ్యామ్‌ప్రసాద్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:03 AM