‘పంట భూములను తీసుకోవద్దు’
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:30 PM
ఏడాదిలో రెండు పంటలు పండే భూమిని పరిశ్రమలకు తీసుకోకుండా ఆలోచించాలని రాజస్థాన్‌కు చెందిన రాజేంద్రసింగ్(వాటర్ మేనే ఆప్ ఇండియా) కోరారు.
భోగాపురం, జూన్3(ఆంధ్రజ్యోతి): ఏడాదిలో రెండు పంటలు పండే భూమిని పరిశ్రమలకు తీసుకోకుండా ఆలోచించాలని రాజస్థాన్‌కు చెందిన రాజేంద్రసింగ్(వాటర్ మేనే ఆప్ ఇండియా) కోరారు. భోగాపురం హైవే సమీపంలో బుధవారం రైతుల చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. కార్యకమ్రంలో రైతులు శ్రీ నివాసరావు, వెంకటేశ్వరరావు, ఉదయబాబు, మురళి, ప్రసాదరావు పాల్గొన్నారు.