కదలవు.. వదలవు
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:31 PM
జియ్యమ్మవలస మండలాన్ని ఏనుగులు వదల డం లేదు. గత వారం రోజులుగా ఇక్కడి నుం చి కదలకుండా తిష్ఠవేశాయి.
- వారం రోజులుగా జియ్యమ్మవలస మండలంలో తిష్ఠవేసిన ఏనుగులు
జియ్యమ్మవలస, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలాన్ని ఏనుగులు వదల డం లేదు. గత వారం రోజులుగా ఇక్కడి నుం చి కదలకుండా తిష్ఠవేశాయి. గవరమ్మపేట, పెదమేరంగి, బాసంగి, కన్నపుదొరవలస పంచా యతీల పరిధిలోనే సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆందో ళన చెందుతున్నారు. శనివారం ఉదయం గవరమ్మ పంచాయతీ పరిధిలో సంచరించిన ఏనుగుల గుంపు మధ్యాహ్నానికి చింతల బెలగాం పంచాయతీ రాజయ్యపేట గ్రామ పరిసరాల్లో తిరిగాయి. మొక్కజొన్న, అరటి, వరి పంటలను నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఏనుగుల తరలింపు విషయంలో అటవీ శాఖ అఽధికారులు తాత్సారం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని కవ్వించేలా ప్ర వర్తించరాదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.