క్రికెట్ బెట్టింగులకు పాల్పడొద్దు: ఎస్పీ
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:14 AM
క్రికెట్ బెట్టింగులకు పాల్పడి జీవి తాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు.
విజయనగరం క్రైం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): క్రికెట్ బెట్టింగులకు పాల్పడి జీవి తాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. మంగళవా రం ఆంధ్రజ్యోతిలో ‘బెట్టింగుకు దిగితే బోల్తా పడినట్టే’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈసందర్భంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడి, ఆర్థికంగా జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. బెట్టింగులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, బుకీలపై నిఘా పెట్టామన్నారు.