Share News

పెండింగ్‌ కేసులపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:32 PM

పెండింగ్‌ కేసులపై నిర్లక్ష్యం వద్దని, సత్వరమే వాటిని పరిష్కరించాలని ఎస్పీ కేవీ మాధవరెడ్డి ఆదేశించారు.

పెండింగ్‌ కేసులపై నిర్లక్ష్యం వద్దు
రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

- ఎస్పీ మాధవరెడ్డి

పాలకొండ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసులపై నిర్లక్ష్యం వద్దని, సత్వరమే వాటిని పరిష్కరించాలని ఎస్పీ కేవీ మాధవరెడ్డి ఆదేశించారు. పాలకొండ పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణ, లాకప్‌, కంప్యూటర్‌ గది, రైటర్‌రూం, రిసెప్షన్‌ కౌంటర్లను పరిశీలించారు. నమోదు చేసిన కేసుల వివరాలను ఎస్‌ఐ వెంకన్నను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో పొందుపరచాలని అన్నారు. ఆయన వెంట సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ వెంకన్న, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:32 PM