గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించవద్దు
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:31 AM
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించవద్దని ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ దిలీప్ చక్రవర్తి హెచ్చరించారు.
పాలకొండ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించవద్దని ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ దిలీప్ చక్రవర్తి హెచ్చరించారు. గురు వారం వెలగవాడ హెచ్‌పీ గ్యాస్ గోదామును ఆయన సందర్శించారు. అక్కడ స్టాక్ నిల్వ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో వినియో గదారులకు గ్యాస్ సరఫరా చేయాలన్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫస్థానిక వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీని తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి గురువారం తనిఖీ చేశారు. గ్యాస్ కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే 7013060655 నెంబర్‌కు తెలియజేయాలన్నారు.