ఆ రోడ్డును మూసివేయవద్దు
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:09 AM
పాలకొండలోని ఏరియాఆసుపత్రిలో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ వల్ల ప్రభుత్వాసుపత్రికి ఉన్న రోడ్డు మూసి వేయడంతో రోగులు, పాదచారులు ఇబ్బందిపడుతున్నారని, రహదారి పూర్తిగా మూసివేయకుండా చర్యలుతీసుకోవాలని నీలమ్మకాలనీ, ఆంజనేయకాలనీ, నాయుడునగర్, సత్యసాయినగర్, మురళీమోహన్‌నగర్ ప్రజలు కోరారు.
పాలకొండ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పాలకొండలోని ఏరియాఆసుపత్రిలో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ వల్ల ప్రభుత్వాసుపత్రికి ఉన్న రోడ్డు మూసి వేయడంతో రోగులు, పాదచారులు ఇబ్బందిపడుతున్నారని, రహదారి పూర్తిగా మూసివేయకుండా చర్యలుతీసుకోవాలని నీలమ్మకాలనీ, ఆంజనేయకాలనీ, నాయుడునగర్, సత్యసాయినగర్, మురళీమోహన్‌నగర్ ప్రజలు కోరారు. ఈ మేరకు వారంతా ఏరియారఆసుపత్రిలో నిర్మిస్తున్న ఆక్సిజన్‌ప్లాంట్ వద్ద నిర్మాణా న్ని ఆయా కాలనీల ప్రజలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి దక్షిణ దిక్కున దాదాపు 50 ఏళ్ల నుంచి ఉన్న రహదా రిని మూసివేయడం వల్ల రోగులు, పాదచారులు, మహిళలు అవస్థలకు గుర వుతున్నారని తెలిపారు.108ఆసుపత్రికి చెరువు గట్టుపైనుంచి రావాల్సిన వస్తోం దని చెప్పారు. ఆసుపత్రిలో దక్షిణ దిక్కున ఉన్న రహదారిని కొనసాగించి ప్రజలకు, పాదచారులకు రోగులకు మేలు చేయాలని కోరారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.