Farmers రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:17 AM
Don't Cause Hardship to Farmers జిల్లాలో ఖరీఫ్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించరాదని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తి చేయాలన్నారు. సోమవారం తన చాంబర్‌లో వ్యవసా యాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.
పార్వతీపురం, జూలై27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించరాదని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తి చేయాలన్నారు. సోమవారం తన చాంబర్‌లో వ్యవసా యాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, అధిక ధరలకు ఎరువులు వి క్రయించినా సహించేది లేదని హెచ్చరించారు. ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం అంచనాలను పక్కాగా రూపొందించడంతో పాటు ఈ-పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్, సహాయసంచాలకులు, తదితరులు పాల్గొన్నారు.
రీసర్వే పనులు పూర్తి చేయండి
భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి జేసీ వైశాలి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడుతూ.. రైతుల హక్కులకు భంగం కలగకుండా సర్వే చేపట్టాలన్నారు. రెవెన్యూ అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న రీ సర్వేను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీవో మాధురి తదితరులు పాల్గొన్నారు.