Share News

Don't call me Cory కోరి నన్ను పిలవద్దు

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:25 AM

Don't call me Cory వాహనదారులారా బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీ కుటుంబ సభ్యులను గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా బండి నడపండి.. ముఖ్యంగా హెల్మెట్‌ ధరించండి.. కోరి నన్ను పిలవకండి’ అంటూ యమధర్మరాజు వేషధారి గేదెల కరుణ్‌కుమార్‌ కోరడం అందరినీ ఆకట్టుకుంది.

Don't call me Cory కోరి నన్ను పిలవద్దు
వాహనదారులకు యమధర్మరాజు, చిత్రగుప్తుని వేషధారణలో అవగాహన కల్పిస్తున్న సామాజిక కార్యకర్తలు కరుణ్‌కుమార్‌, జనార్దన్‌

కోరి నన్ను పిలవద్దు

హెల్మెట్‌ పెట్టుకోండి.. ఆయువు పెంచుకోండి

వాహనదారులకు యమధర్మరాజు వేషధారి హితబోధ

బొబ్బిలి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

వాహనదారులారా బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీ కుటుంబ సభ్యులను గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా బండి నడపండి.. ముఖ్యంగా హెల్మెట్‌ ధరించండి.. కోరి నన్ను పిలవకండి’ అంటూ యమధర్మరాజు వేషధారి గేదెల కరుణ్‌కుమార్‌ కోరడం అందరినీ ఆకట్టుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం వినూత్నంగా ప్రయత్నించారు. యమధర్మరాజు వేషాన్ని ధరించి స్థానిక కాలేజీ రోడ్డు జంక్షన్‌లో ప్రతి వాహనదారుతో మాట్లాడారు. తనకు చిత్రగుప్తుని వేషధారణలో ఎం.బూర్జివలస గ్రామానికి చెందిన జనార్దన్‌ సహకరించారు.

Updated Date - Feb 16 , 2026 | 12:25 AM