సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:05 AM
పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో అలసత్వ వహిస్తే సహించేది లేదని కలెక్టర్ రామ సుందర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు.
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
పీజీఆర్‌ఎస్‌కు 181 వినతులు
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో అలసత్వ వహిస్తే సహించేది లేదని కలెక్టర్ రామ సుందర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు 181 వినతులు వచ్చా యి. వీటిని కలెక్టర్‌తో పాటు డీఆర్వో చందక సత్తిబాబు, డిప్యూటీ కలెక్టర్లు స్వీకరించారు. మొత్తం 181 వినతులు రాగా, వీటిలో భూ సమస్యలపై 69, పంచాయతీరాజ్ 16, మున్సిపల్ 2, విద్యుత్ శాఖ 7, హౌసింగ్ 2, డీసీ హెచ్‌ఎస్ 1, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 4, గ్రామ సచి వాలయం శాఖ 4, విద్యా శాఖ 3, ఇతర శాఖలకు సంబంధించి 56 వినతులు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ విన తుల పరిష్కారంలో వేగవంతంగా పని చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వినతులను పరిష్కరించిన వెంటనే డిస్పోజ్ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పీజీఆర్‌ఎస్ వినతులను ఆన్‌లైన్‌లో ద్వారా వైబ్‌సైట్‌లో చెక్ చేసు కోవాలని సూచించారు. 1100 టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా అందిన కాల్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వారం పీజీఆర్‌ఎస్‌పై సీఎం, సీఎస్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నందున అధికా రులు జాగురతతో వ్యవహరించాలన్నారు. జిల్లాలోని వివిధ షాపుల్లో విచ్చలవిడిగా శీతలపానీయాలు విక్ర యించడం వల్ల పిల్లలు ఆరోగ్యంపై ప్రభావం పడు తుందని, వెంటనే దీనిని పరిష్కరించాలంటూ విజ య నగరం పట్టణానికి చెందిన సమాజ్ వాది రాష్ట్ర లీగల్ అధ్యక్షుడు పి.కరుణకర్ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియం లో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి నలుగురు లబ్ధిదారులకు 22ఏ డీ నోటిఫికేషన్ ఆర్డర్లు అందజేశారు. ఈ కార్యక్ర మంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.