Share News

Doli-Free Villages డోలీ రహిత గ్రామాలే లక్ష్యం

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:35 PM

Doli-Free Villages as the Goal సీతంపేట ఐటీడీఏ పరిధిలోని అన్ని గిరిజన ప్రాంతాలను డోలిరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. శుక్రవారం ఎగువ, దిగువ ద్వారబంధం గ్రామాల్లో ఆయన పర్యటించారు.

Doli-Free Villages   డోలీ రహిత గ్రామాలే లక్ష్యం
రహదారి పనులపై ఇంజనీరింగ్‌ అధికారులకు సూచనలిస్తున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో

సీతంపేట రూరల్‌,జనవరి 30(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని అన్ని గిరిజన ప్రాంతాలను డోలిరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. శుక్రవారం ఎగువ, దిగువ ద్వారబంధం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూ.40లక్షలతో మంజూరైన రహదారి నిర్మాణాలను త్వరలోనే ప్రారంభిస్తామని పీవో తెలిపారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధా న్యం ఇస్తున్నామని, తాగునీరు, పారిశుధ్య సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు. సకాలంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిశిఖర గ్రామాలకు అంబులెన్స్‌ వెళ్లేలా రహదారులు నిర్మిస్తామని తెలిపారు. ఆయన వెంట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌ ఈఈ రమాదేవి, తహసీల్దార్‌ శ్రీకన్య, డీఈఈ నాగభూషణం, డీఎస్పీ రాంబాబు తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:35 PM