కుక్కల దాడి: బాలుడికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:08 AM
కేసలి గ్రామంలో ఆదివారం ఉదయం కుక్కల దాడిలో మూడున్నరేళ్ల బాలుడు పతేడ డేవిడ్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు.
పాచిపెంట రూరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కేసలి గ్రామంలో ఆదివారం ఉదయం కుక్కల దాడిలో మూడున్నరేళ్ల బాలుడు పతేడ డేవిడ్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో కుక్కలు దాడి చేశాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గాయాలపాలైన బాలుడిని సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల సంచారం పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..