Share News

దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:19 AM

రిజిస్ట్రేషన్‌ విధానంలో నూతన మార్పులు చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవా లని దస్తావేజు లేఖర్లు సోమవారం పెన్‌డౌన్‌ చేపట్టా రు.

దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌

గజపతినగరం, జూలై 20(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌ విధానంలో నూతన మార్పులు చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవా లని దస్తావేజు లేఖర్లు సోమవారం పెన్‌డౌన్‌ చేపట్టా రు. స్థానిక సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం ఎదురుగా టెం ట్లు వేసి, నిరసన తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తామని చెప్పా రు.

శృంగవరపుకోట, జూలై 20(ఆంధ్రజ్యోతి): జీవో 396ను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో సోమవారం ఎస్‌.కోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు ఆందోళన చేశారు.

విజయనగరం దాసన్నపేట, జూలై 20(ఆం ధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకి స్తూ దస్తావేజు లేఖరులు సోమవారం నిరసన చేపట్టారు. ఈనెల 20 తేదీ నుంచి 31 వరకూ పూర్తిగా పెన్‌డౌన్‌ నిర్వహిస్తామ ని జిల్లా లేఖరుల సంఘం ప్రతినిధి ప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా 11 సబ్‌ రిజిస్టార్‌ కార్యాల యాల్లో రోజూ కోటి 50 లక్షలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడనుంది.

చీపురుపల్లి, జూలై 20(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్‌ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.

Updated Date - Jul 21 , 2026 | 12:19 AM