Share News

డాక్టర్‌.. ఐ లవ్‌ యూ

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:27 PM

డాక్టర్‌.. ఐ లవ్‌ యూ అంటూ నిత్యం పదుల సంఖ్యలో మెసేజ్‌లు, ఫోన్లు చేస్తూ ఓ వైద్యురాలిని వేధిస్తున్న వ్యక్తిని రాజాం పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకు న్నారు.

  డాక్టర్‌.. ఐ లవ్‌ యూ

- వైద్యురాలిని వేధిస్తున్న వ్యక్తి

- బాధితురాలి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాజాం రూరల్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌.. ఐ లవ్‌ యూ అంటూ నిత్యం పదుల సంఖ్యలో మెసేజ్‌లు, ఫోన్లు చేస్తూ ఓ వైద్యురాలిని వేధిస్తున్న వ్యక్తిని రాజాం పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకు న్నారు. ఎస్‌ఐ సలీం బేగ్‌ వివరాల మేరకు.. తెర్లాం మండలానికి చెందిన ఓ వైద్యురాలు బొబ్బిలి జంక్షన్‌లో గత ఏడాదిగా డెంటల్‌ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రి పక్కన ఇదే ప్రాంతానికి చెందిన పవన్‌ అనే వ్యక్తి చిన్నపాటి షాపు నిర్వహిస్తున్నాడు. హాస్పిటల్‌ బోర్డుపై ఉన్న వైద్యురాలి నెంబర్‌ను సేకరించిన పవన్‌ ఆమెకు నిత్యం ఫోన్ల చేయడంతో పాటు అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తుండేవాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు కూడా నన్ను ప్రేమించంటూ’ ఆమెను వేధిస్తూ మొబైల్‌కు పదుల సంఖ్యలో మెసేజ్‌లు పంపిస్తుండేవా డు. దీంతో పవన్‌ను పలుమార్లు ఆమె హెచ్చరించి, అతని నెంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. అయినా, పవన్‌ మరో నెంబర్‌తో ఆమెను మరింత తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. విసుగుచెందిన వైద్యురాలు శుక్రవారం సాయంత్రం రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పవన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jul 03 , 2026 | 11:27 PM