computer education? కంప్యూటర్ విద్య అందిస్తారా?
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:56 PM
Do you provide computer education? కంప్యూటర్ విద్య.. ఇది ప్రస్తుత పోటీ ప్రపం చంలో విద్యార్థులకు ఎంతో అవసరం. అందుకే గత టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించింది. విద్యార్థుల కోసం బడులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అందిం చింది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అధికారికంగా ప్రాజెక్టుల రూపంలో ప్రవేశపెట్టారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కంప్యూటర్ విద్యకు మంగళం పాడింది. ఫలితంగా పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యకు దూరమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాఠశాల విద్యార్థులు సీఎం చంద్రబాబు ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
పాఠశాలలకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మంజూరు
వైసీపీ సర్కారు వచ్చాక సీన్ రివర్స్
మూలకు చేరిన పరికరాలు..
లక్షలాది రూపాయలు వృథా
కూటమి నిర్ణయం కోసం విద్యార్థుల ఎదురుచూపు
జియ్యమ్మవలస, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కంప్యూటర్ విద్య.. ఇది ప్రస్తుత పోటీ ప్రపం చంలో విద్యార్థులకు ఎంతో అవసరం. అందుకే గత టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించింది. విద్యార్థుల కోసం బడులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అందిం చింది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అధికారికంగా ప్రాజెక్టుల రూపంలో ప్రవేశపెట్టారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కంప్యూటర్ విద్యకు మంగళం పాడింది. ఫలితంగా పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యకు దూరమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాఠశాల విద్యార్థులు సీఎం చంద్రబాబు ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతోనే గత టీడీపీ ప్రభుత్వం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అందించింది. ఇందుకోసం ఒక్కో జిల్లాకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూములు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం చేశారు. కంప్యూటర్ విద్యను సమర్థంగా బోధించి విద్యార్థుల్లో మంచి నైపుణ్యం పెంపొందించేలా కంప్యూటర్ బోధకులకు శిక్షణ అందించారు. జర్మన్‌కు చెందిన ప్రముఖ సీమెన్స్ సంస్థలో భాగస్వామ్యం కుదుర్చుకుని క్లస్టర్లు ఏర్పాటు చేసి అత్యాధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కేవలం థియరీ చదువుల కోసం మాత్రమే చూడకుండా వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేందుకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ కోడింగ్ వంటి అంశాలను పాఠశాల స్థాయి నుంచే అందేలా చేశారు ప్రముఖ ఐటీ, కోర్ కంపెనీలతో భాగస్వామ్యం కుదర్చుకుని దానికనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేశారు. ఇలా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సమగ్ర విద్యా నమూనాగా టీడీపీ ప్రభుత్వం తీర్చిదిద్దింది.
సీన్ రివర్స్
వైసీపీ సర్కారు పాలనలో కంప్యూటర్ విద్య అటకెక్కింది. టీడీపీ ప్రభుత్వం అందించిన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అంతా మూలనపడ్డాయి. కాగా వాటిల్లో కొన్ని అదృశ్యమయ్యాయి. ఈ లెక్క జిల్లా విద్యాశాఖకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జియ్యమ్మవలస మండలం ఆర్‌ఆర్‌బీ పురంలో ఉన్న జీటీడబ్ల్యూ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 40 ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వగా, ఇప్పుడు 32 మాత్రమే ఉన్నాయి. వాటిని బీరువాలలో భద్రపరిచి ఉంచారు. ఇదే మండలం టీకే జమ్ము గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 20 ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తే అవి అలాగే మూలన పడి ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఇచ్చిన కంప్యూటర్లలో చాలా వరకు బయటకు వెళ్లిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదేశాలు రాలేదు..
పాఠశాల దశ నుంచి కంప్యూటర్ విద్య అందించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తరువాత కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
బ్రహ్మాజీరావు, డీఈవో పార్వతీపురం మన్యం