Share News

నిషేధిత మందులు విక్రయించవద్దు’

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:40 AM

మెడికల్‌ దుకాణాల్లో నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లావణ్య హెచ్చరించారు.

నిషేధిత మందులు విక్రయించవద్దు’
తనిఖీలు నిర్వహిస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లావణ్య

రామభద్రపురం, సెప్టెం బరు 23 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌ దుకాణాల్లో నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లావణ్య హెచ్చరించారు. ఆపరేషన్‌ గరుడలో భాగంగా మండలంలోని పలు మెడికల్‌ షాపుల్లో బుధవారం తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఎక్స్‌ మందుల కొనుగోలు, అమ్మకాల బిల్లులు పరిశీలించారు. వీటిని దుర్వినియోగం చేస్తే లైసెన్స్‌లు రద్దుచేస్తామని హెచ్చరించారు. అలాగే హెచ్‌-1 రిజిస్టర్‌ తనిఖీ చేశారు. తనిఖీల్లో ఈగల్‌ టీం సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:40 AM