Share News

వెల్నెస్‌ సెంటర్‌ను దూరం చేయొద్దు

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:09 AM

పేరాపురం గ్రామంలో గల ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రం(వెల్నెస్‌)ను పూసపాటిరేగ పీహెచ్‌సీ నుంచి రెల్లివలస పీహెచ్‌సీ పరిధిలోకి మార్పు చేయవద్దంటూ ఆ గ్రామ నాయకులు, ప్రజలు డిమాండ్‌ చేశారు.

 వెల్నెస్‌ సెంటర్‌ను దూరం చేయొద్దు

  • పేరాపురం గ్రామస్థుల ఆందోళన

పూసపాటిరేగ, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): పేరాపురం గ్రామంలో గల ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రం(వెల్నెస్‌)ను పూసపాటిరేగ పీహెచ్‌సీ నుంచి రెల్లివలస పీహెచ్‌సీ పరిధిలోకి మార్పు చేయవద్దంటూ ఆ గ్రామ నాయకులు, ప్రజలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం పూసపాటిరేగ పీహెచ్‌సీ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం వైద్యాధికారి కృష్ణచైతన్యకు వినతిపత్రం అందజేశారు. పేరాపురం నుంచి రెల్లివలస సుమారు 10 కిలోమీటర్లు ఉండటంతో గర్భిణులు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. కార్యక్రమంలో పేరాపురం మాజీ సర్పంచ్‌ శ్రీరామమూర్తి, జనసేన పార్టీ మండల నాయకుడు కొలచిన రమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:09 AM