గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:58 PM
Do Not Neglect the Health of Tribal Students గిరిజన విద్యాలయాల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించరాదని ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్వతీపురం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యాలయాల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించరాదని ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ విద్యా సంస్థల హెచ్ఎంలు తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులు, తల్లిదండ్రులకు అందించాలని తెలిపారు. ఏటీడబ్ల్యూవో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.