Share News

Road Construction రహదారుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించొద్దు

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:33 AM

Do Not Neglect Road Construction గిరిశిఖర గ్రామాల్లో పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు.

  Road Construction  రహదారుల నిర్మాణంలో  నిర్లక్ష్యం వహించొద్దు
వాట్సాప్‌ గవర్నెన్స్‌ స్టాండింగ్‌ బోర్డు వద్ద కలెక్టర్‌, జేసీ తదితరులు

పార్వతీపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. పనుల్లో పురోగతి లేకుండా పొంతనలేని వివరాలు ఇస్తే.. ఊరుకోబో మన్నారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పించాలనే లక్ష్యంతో శరవేగంగా రహదారుల పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు.. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పనుల ఫొటోలు, వివరాలను అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పంచాయతీరాజ్‌ ఈఈలు, ఏఈలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరులోగా సీఎస్‌సీ పనులు పూర్తికావాలి

జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ (సీఎస్‌సీ) పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. రోజువారీ పనుల ప్రగతిని వివరించాలన్నారు. ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని తెలిపారు. అన్ని నిర్మాణాలు సమాంతరంగా సాగాలని ఆదేశించారు. ప్రతి అధికారికీ ఒక స్పష్టమైన ప్రణాళిక, వ్యూహం ఉండాలని తెలిపారు.

జిల్లాకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ స్టాండింగ్‌ బోర్డులు

ప్రజలకు పారదర్శకంగా ప్రజలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్‌ గవర్నెన్స్‌కు సంబంధించి జిల్లాకు 81 స్టాండింగ్‌ బోర్డులు మంజూరయ్యాని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో బోర్డును ఆవిష్కరించారు. ఈ బోర్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ లేదా వాట్సాప్‌ నెంబర్‌ 95523 00009 ద్వారా ప్రజలు ఒక్క మెసేజ్‌తో దాదాపు 300కు పైగా ప్రభుత్వ సేవలను పొందొచ్చని కలెక్టర్‌ తెలిపారు. గ్రామ, వార్డు సచివాల యాలు, బస్టాండ్లు, జనసమూహ ప్రాంతాల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో కె.బాల్‌మాన్‌సింగ్‌ , ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:33 AM