Share News

Do not mistakes. పొరపాట్లకు తావీయొద్దు

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:09 AM

Do not mistakes. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల నిర్వహణపై శనివారం సాయంత్రం జడ్పీ సమావేశ మందిరంలో రిటర్నింగు అధికారులు, సహాయ రిటర్నింగు అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడారు.

Do not mistakes. పొరపాట్లకు తావీయొద్దు
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

పొరపాట్లకు తావీయొద్దు

నామినేషన్ల ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరిచాలి

ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘా పెట్టాలి

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల నిర్వహణపై శనివారం సాయంత్రం జడ్పీ సమావేశ మందిరంలో రిటర్నింగు అధికారులు, సహాయ రిటర్నింగు అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున మోడల్‌ కోడ్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ వంటి కీలక దశలను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలన్నారు. నామినేషన్లు పరిశీలనలో ఏమైనా లోపాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినప్పుడు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు, జడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షల వరకూ ఎన్నికల వ్యయ పరిమితి ఉందన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులు, సీరియల్‌ నెంబర్లు తదితర ముద్రణకు ముందే క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా బ్యాలెట్‌ పేపర్లను సిద్ధం చేసుకోవాలని,. ఎన్నికల సామగ్రిని ముందస్తుగా తనిఖీ చేసుకోవాలన్నారు. బ్యాలెట్‌ బాక్సులు సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా అనేది చూసుకోవాలన్నారు.

ఫిబ్రవరి 5వ తేదీ వరకూ ఉన్న కటాఫ్‌ తేదీ ఆధారంగా ఏప్రిల్‌లో ప్రచురించిన నిర్దేశిత ఓటర్ల జాబితాలను మాత్రమే ఎన్నికల నిర్వహణలో ఉపయోగించాలని చెప్పారు. 800 ఓట్లకు మించిన పోలింగ్‌ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఐదుగురు పోలింగ్‌ అధికారులు ఉండేలా సిబ్బంది కేటాయింపు చేపట్టాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి నాణ్యమైన భోజనం, తాగునీరు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రైనింగ్‌ మేనేజరు హేమ సుందరరావు పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్‌, జడ్పీ సీఈవో కిరణకుమార్‌, డిప్యూటీ సీఈవో లవరాజు, డీపీవో మల్లిఖార్జున్‌ ఉన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:09 AM