Share News

లైసెన్స్‌ ప్రక్రియను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దు

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:15 AM

రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన సాగుతున్న ఎల్‌ఎల్‌ఆర్‌, లైసెన్స్‌ ప్రక్రియను ప్రైవే టు సంస్థలకు అప్పగించే ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్‌ పాండా డిమాండ్‌ చేశారు.

 లైసెన్స్‌ ప్రక్రియను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దు

  • ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్‌ పాండా

విజయనగరం క్రైం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన సాగుతున్న ఎల్‌ఎల్‌ఆర్‌, లైసెన్స్‌ ప్రక్రియను ప్రైవే టు సంస్థలకు అప్పగించే ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్‌ పాండా డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన విజయ నగ రం, అనకాపల్లి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో ఎల్‌ఎ ల్‌ఆర్‌, లైసెన్సులు మంజూరు చేయడానికి మారుతీ సుజికీ వంటి సంస్థలతో కుదర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా విజయదుర్గా ఆటోవర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రవాణా శాఖ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రతినిధులు అప్పలరాజు రెడ్డి, రెడ్డి నారాయణరావు, శ్రీధర్‌, ధర్మారావు తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:15 AM