ఖైదీలపై వివక్ష చూపొద్దు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:27 AM
ఖైదీల పట్ల వివక్ష చూపవద్దని జిల్లా నాలుగో అదనపు న్యాయాధికారి ఎం.శ్రీధర్ అన్నారు.
జిల్లా నాలుగో అదనపు న్యాయాధికారి శ్రీధర్
శృంగవరపుకోట, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ఖైదీల పట్ల వివక్ష చూపవద్దని జిల్లా నాలుగో అదనపు న్యాయాధికారి ఎం.శ్రీధర్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌తో కలిసి ఎస్.కోట సబ్ జైలును సందర్శించారు. ఈసందర్భం గా కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి.. పలు చట్టాలపై అవగాహన కల్పించారు. జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్స్ విధులను పర్యవేక్షించారు. న్యా యవాదులు, పారా లీగల్ వలంటీర్ల విధులపై ఆరా తీశారు. ఖైదీల పట్ల వివక్ష చూపే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయ న్నారు. జైలులో సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. వంట గది, భోజన శాలను పరిశీలించారు. స్థానిక జూనియర్ సివిల్ న్యాయాధికారి కనకలక్ష్మి, డీఎస్పీ రాఘవులు, సీఐ నారాయణమూర్తి, తహసీల్దార్ డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.