Share News

‘నాణ్యతలో రాజీ పడొద్దు’

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:32 AM

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురు కులాలు, ఏకలవ్య పాఠశాలలకు పంపిణీ చేయనున్న ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడొద్దని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు.

‘నాణ్యతలో రాజీ పడొద్దు’
మాట్లాడుతున్న ఇన్‌చార్జి పీవో పవార్‌ జగన్నాథ్‌

సీతంపేట, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురు కులాలు, ఏకలవ్య పాఠశాలలకు పంపిణీ చేయనున్న ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడొద్దని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం వివిధ పాఠశాలలకు ఆహార పదార్థాల సరఫరాకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు సరఫరా చేసే కూరగాయలు, పాలు, చికెన్‌, అరటిపండ్లలో నాణ్యత లోపించకూడదని టెండర్‌దారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. టెండర్‌ ప్రక్రియలలో 24 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో డీడీ ఎం.అన్నాదొర, జీసీసీ డీఎం దాసరి కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:32 AM