ప్రజారోగ్యం విషయంలో రాజీపడొద్దు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:21 AM
ప్రజారోగ్యం విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, అన్ని ఆరోగ్యపథకాలను ప్రజలకుఅందించాలని జిల్లావైద్యాధికారు లు శైలజ, గిరి గణేష్ పేర్కొన్నారు. బుధవారం వేపాడ, కల్లేపల్లి పీహెచ్సీలను జిల్లా అధికారులు తనిఖీచేశారు.
లక్కవరపుకోట, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యం విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, అన్ని ఆరోగ్యపథకాలను ప్రజలకుఅందించాలని జిల్లావైద్యాధికారు లు శైలజ, గిరి గణేష్ పేర్కొన్నారు. బుధవారం వేపాడ, కల్లేపల్లి పీహెచ్సీలను జిల్లా అధికారులు తనిఖీచేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందోలేదో నని పరిశీలించారు. విధులకు సరిగా రాకపోయినా, విధి నిర్వహణలో అలసత్వం వహించినా మెమోలు జారీచేయాలని వైద్యాధికారి అజయ్కుమార్కు సూచించా రు. జిల్లాలో 72 పీహెచ్సీలకు గాను 12 ఎ-గ్రేడు, 38 బి గ్రేడు, 22 సి గ్రేడు సాధించాయని, రాష్ట్రర్యాంకులో జిల్లా 8వ స్థానం సాధించిందని తెలిపారు.