బందోబస్తు విధుల్లో అలసత్వం వద్దు
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:26 AM
: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయా న్ని ఆగస్టు 1న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారం భించనున్న నేపథ్యంలో బందోబస్తు విధుల్లో అలస త్వం వహించవద్దని గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఐజీ కె.శ్రీకాంత్ పోలీసు యంత్రాంగానికి సూచించారు.
భోగాపురం, జూలై 28(ఆంధ్రజ్యోతి): భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయా న్ని ఆగస్టు 1న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారం భించనున్న నేపథ్యంలో బందోబస్తు విధుల్లో అలస త్వం వహించవద్దని గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఐజీ కె.శ్రీకాంత్ పోలీసు యంత్రాంగానికి సూచించారు. భోగాపురం విమానాశ్రయంలో మంగళవారం ఆయన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బందోబస్తు, ట్రాఫిక్, భద్రత విధులకు సంబంధించి తీసుకోవల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. బందో బస్తు విధుల ను సెక్టార్లుగా విభజించి వాటిని పర్యవేక్షించేందుకు ఒక్కో సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగించామని చెప్పారు. వీరికి సహకరించేందుకు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, తదితర సిబ్బంది ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ.. ప్రధాని సభకు వచ్చేవారు సురక్షితం గా తిరిగి బయటికి వెళ్లేలా చూడాలన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ బందోబస్తు విజయవంతం అయ్యేలా ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాల న్నారు. ఈ కార్యక్రమంలో గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, ఎస్పీ ఏఆర్ దామోదర్, గ్రైహౌండ్స్ ఎస్పీ సుమిత్ గరుడ్, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డి, తుహిర్ సిన్హా, కర్నూల్, చింతలవలస, ఏపీఎస్పీ కమాండెంట్లు దీపికా పాటిల్, రవిశంకర్, సీఐడీ ఎస్పీ శ్రీధర్, 16వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ అనీల్ పులిపాటి, మెరైన్ ఎస్పీ శ్రావణి, తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.