న్యాయం చేయండి
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:45 AM
పట్టణంలోని పెద్ద చెరువుగట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆదివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిశారు.
సాలూరు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పెద్ద చెరువుగట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆదివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ దాదాపు 40 ఏళ్లుగా చెరువు గట్టుపై జీవనం సాగిస్తున్నామన్నారు. చెరువు గట్టు ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టే పరిస్థితి ఉన్నందున తమ భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని వారు వివరించారు. రోడ్డు విస్తరణ జరిగితే తమ పరిస్థితి అగమ్యగోచరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలో తమకు న్యాయం చేయాలని, సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు మంత్రి ని కోరారు. అందుకు సానుకూలంగా మంత్రి స్పందించారు. సాలూరు మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి స్థానిక కుటుంబాలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించారు. అలాగే అవసరమైతే వారికి నివాసానికి అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి ప్రభుత్వపరంగా సహాయ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.