Share News

‘Divyang Shakti’ నేటి నుంచి ‘దివ్యాంగ శక్తి’

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:51 PM

‘Divyang Shakti’ Begins Today జిల్లాలో దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. దీనికి ‘దివ్యాంగ శక్తి’ పథకంగా ప్రభుత్వం నామకరణం చేసింది. 19న ఉగాది పండుగ నేపథ్యంలో బుధవారం నుంచే దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయనున్నారు.

‘Divyang Shakti’  నేటి నుంచి ‘దివ్యాంగ శక్తి’

  • ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం

సాలూరు రూరల్‌/పాలకొండ, మార్చి17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. దీనికి ‘దివ్యాంగ శక్తి’ పథకంగా ప్రభుత్వం నామకరణం చేసింది. 19న ఉగాది పండుగ నేపథ్యంలో బుధవారం నుంచే దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయనున్నారు. 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండేవారు ఈ పథకానికి అర్హులు. పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించొచ్చు. అలా్ట్ర డీలక్స్‌, అంతర్‌ రాష్ట్ర సర్వీసులు తదితర వాటిల్లో 50 శాతం రాయితీపై ప్రయాణ సౌకర్యం ఉంటుంది. వంద శాతం మానసిక రోగులు, అంధత్వం ఉన్నవారితో పాటు ఎస్కార్ట్‌గా వచ్చేవారు కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించొచ్చు. మొత్తంగా ‘దివ్యాంగ శక్తి’ పథకం కిందట పాలకొండ, పార్వతీపురం, సాలూరు ఆర్టీసీ డిపోల పరిధిలో 3,200 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే పాస్‌లున్న వారికి మూడేళ్లు పాటు అవి చెల్లుబాటు అవుతాయి. ఇవి లేని వారు సదరం ధ్రువపత్రం తీసుకెళ్లి పాస్‌ను తీసుకోవాల్సి ఉంది.

- సాలూరు డిపో నుంచి 71, పార్వతీపురం డిపోలో 89 బస్సులు, పాలకొండ డిపో నుంచి 79 బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఇప్పటికే ఆయా డిపోల నుంచి నడుస్తున్న పల్లెవెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆక్యుపెన్సీ రేట్‌ శతశాతం దాటింది. అయితే ‘దివ్యాంగ శక్తి’ పథకంతో నేటి నుంచి దివ్యాంగులకు కూడా మేలు జరగనుంది. కాగా సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, పాలకొండలో నిమ్మక జయకృష్ణ, పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయచంద్ర, ‘దివ్యాంగ శక్తి ’ పథకాన్ని ప్రారంభించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభిస్తుంది. దీనిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో మూడు ఆర్టీసీ డిపోల పరిధిలో 3,200 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరందరూ 164 బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించొచ్చు. పల్లెవెలుగు అ ల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.

- కె.శ్రీనివాసరావు, జిల్లా ప్రజా రవాణాధికారి

Updated Date - Mar 17 , 2026 | 11:51 PM