Share News

Police Inspections జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:01 AM

District-Wide Police Inspections శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఆదివారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.

 Police Inspections  జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విస్తృత తనిఖీలు చేస్తున్న పోలీసులు

బెలగాం/సాలూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి) : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఆదివారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, బీడీ టీంతో తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, మార్కెట్లు, ప్రార్థనా మందిరాలు, జన సముదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాలనూ పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.

Updated Date - Feb 23 , 2026 | 12:01 AM