Share News

సీఎంను కలిసిన జిల్లా ప్రజాప్రతినిధులు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:30 AM

జిల్లాలోని సమస్య లపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడును గురువారం అమరావతిలో కలిశారు.

సీఎంను కలిసిన జిల్లా ప్రజాప్రతినిధులు
సీఎంతో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

పార్వతీపురం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సమస్య లపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడును గురువారం అమరావతిలో కలిశారు. సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. సాలూరు నియోజకవర్గంలో ఆటోనగర్‌ ఏర్పాటు తదితర సమస్యలను పరిష్కరించాలని సీఎంను మంత్రి సంధ్యారాణి కోరారు. కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి విన్నవించారు. పార్వతీపురం నియోజకవర్గానికి సంబందించి బైపాస్‌ రహదారి నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజయచంద్ర వినతిపత్రం అందజేశారు. భామిని మండలంలో సాగునీటి సమస్యతో పాటు పాలకొండ బైపాస్‌ రహదారి తదితర సమస్యలను పరిష్కరించాల సీఎంను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అభ్యర్థించారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని సంధ్యారాణి తెలిపారు.

Updated Date - Aug 21 , 2026 | 12:30 AM